: మగవారు బతుకమ్మ ఆడటం రాష్ట్రానికే అరిష్టం: గుత్తా
తెలంగాణలో రైతులు సంక్షోభంలో ఉంటే పట్టించుకోకుండా... బతుకమ్మ పేరుతో రూ. 100 కోట్లు ఖర్చు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. బహుమతుల పేరుతో వ్యాపారుల నుంచి భారీగా చందాల వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని అన్నారు. మగవారు బతుకమ్మ ఆడటం ఉండదని... కానీ టీఆర్ఎస్ పాలనలో మగవారు కూడా బతుకమ్మ ఆడుతున్నారని... ఇది రాష్ట్రానికి చాలా అరిష్టమని చెప్పారు. రాష్ట్రం మొత్తానికి కాకుండా, కేవలం గజ్వేల్ ప్రాంతానికే కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.