: ట్విట్టర్ లో ప్రచారానికి దిగిన చంద్రబాబు కుటుంబం
"మన అమరావతి-మన రాజధాని" అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబం అమరావతిని ప్రమోట్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగింది. ట్విట్టర్ మాధ్యమంగా జరుగుతున్న ఈ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. చేతిలో ఉన్న పలకపై "మన అమరావతి-మన రాజధాని" అని రాసుండగా, దాన్ని చూపుతూ తీయించుకున్న చంద్రబాబు తన ఫోటోను ట్వట్టర్ లో ఉంచారు. ఆపై ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ లు అదే దారిలో నడిచారు. అంతేకాదు, తన మనవడు కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతుండగా, ముందు పలకను ఉంచి తీసిన ఫోటోనూ ట్విట్టర్ లో ఉంచారు.