: అమరావతి అతిథుల కోసం రెండు బస్సులు పంపిన సూపర్ స్టార్ రజనీకాంత్


అమరావతికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులను వేదిక వద్దకు తరలించేందుకు దక్షిణాది సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు అత్యాధునిక బస్సులను పంపినట్టు తెలుస్తోంది. వీటిని వీవీఐపీలను ఎయిర్ పోర్టు నుంచి శంకుస్థాపన వేదిక వద్దకు తరలించేందుకు వాడనున్నట్టు సమాచారం. మొత్తం 100 బస్సులను ఆహ్వానితుల కోసం కేటాయించామని పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని వెల్లడించారు. అతిథుల స్థాయిని బట్టి వారికి వాహనాలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటికే పలువురు విజయవాడ వాసులు తమ ఖరీదైన ఆడి, బెంజ్ తదితర కార్లను వీవీఐపీలు, వీఐపీల రవాణా సౌకర్యం నిమిత్తం అందజేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News