: రియో ఒలింపిక్స్ ఫీవర్... గంటల వ్యవధిలో లక్షల టికెట్ల అమ్మకం


వచ్చే ఏడాది బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జరగనున్న ఒలింపిక్స్ టికెట్ల కోసం క్రీడాభిమానులు ఎగబడుతున్నారు. ఆన్ లైన్లో టికెట్లను ఉంచగా, తొలి గంటకే 1.20 లక్షల టికెట్లు అమ్ముడుబోయాయి. 8 గంటల వ్యవధిలో 2.40 లక్షల టికెట్లు సేల్ అయ్యాయి. ఈ టికెట్లు కేవలం బ్రెజిల్ వాసులకే. ఇతర దేశాల వారు అధికారిక విక్రయదారుల వద్దనే టికెట్లు కొనాల్సి ఉంది. బాస్కెట్ బాల్, వాలీబాల్, ఫుట్ బాల్ గేమ్స్ కు ఎక్కువ డిమాండ్ ఉందని నిర్వాహకులు తెలిపారు. తొలిసారి దక్షిణ అమెరికాలో ఒలింపిక్స్ జరుగుతుండటం గమనార్హం. 2016 ఆగస్టు 5-21 తేదీల మధ్య ఒలింపిక్స్ జరుగుతాయి.

  • Loading...

More Telugu News