: పూర్తయిన శంకుస్థాపన ఏర్పాట్లు... స్థానికులనూ అనుమతించని ఎస్పీజీ
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం ఏర్పాట్లను పూర్తి చేశామని కాంట్రాక్టులు వెల్లడించగానే, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) పోలీసులు వేదిక మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆపై అణువణువూ డాగ్ స్క్వాడ్, బాంబ్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. గడచిన వారం రోజులుగా ఏర్పాట్లను చూసేందుకు చుట్టుపక్కల వారు తండోపతండాలుగా రాగా, వారంతా ప్రధాన వేదిక, యాగశాల, వంటశాల తదితర ప్రాంతాలన్నీ కలయదిరిగారు. ఇవాళ మాత్రం ఏర్పాట్లు చూడాలని వచ్చిన స్థానికులకు నిరాశే మిగిలింది. వేదిక వైపు కాదుకదా, ప్రాంగణం దగ్గరకు కూడా ఎవరినీ పోలీసులు అనుమతించ లేదు. దీంతో స్థానికులు కొంత మనస్తాపం చెందారు. కాగా, ఈ ఉదయం ఏపీ మంత్రి నారాయణ ఏర్పాట్లను పరిశీలించి సంతప్తిని వ్యక్తం చేశారు.