: ఈ ఏడాది క్యాంపస్ నియామకాలకు ఫేస్ బుక్ దూరం!


ఇండియాలో ఐఐటీయన్లకు మంచి ఆఫర్లతో కూడిన ఉద్యోగాలిచ్చే ఉత్తమ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఫేస్ బుక్, ఈ సంవత్సరం క్యాంపస్ నియామకాలను రద్దు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇంటర్న్ షిప్ తో పాటు ఫైనల్ ప్లేస్ మెంట్ కు సైతం ఫేస్ బుక్ దూరంగా ఉన్నట్టు ఐఐటీ ప్లేస్ మెంట్ సెల్స్ వెల్లడించాయి. ఇందుకు కారణం భారత యువత టాలెంట్ పై నమ్మకం లేకపోవడం కాదని, హెచ్-1బీ వీసాల సంఖ్య అతి తక్కువగా ఉండటమేనని తెలుస్తోంది. కాగా, గత సంవత్సరం 10 మందికి పైగా ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్న ఫేస్ బుక్ కొందరికి రూ. 2 కోట్ల వేతనాన్ని కూడా ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయానికి కూడా వెళ్లారు. ఈ సంవత్సరం ప్లేస్ మెంట్స్ విషయంలో స్పందించేందుకు ఫేస్ బుక్ భారత ప్రతినిధి నిరాకరించారు.

  • Loading...

More Telugu News