: ప్రపంచ బ్యాంకుపై విరుచుకుపడ్డ మోదీ సర్కారు!
ఇండియాలో పేదరికంపై ప్రపంచ బ్యాంకు ఇటీవల వెల్లడించిన నివేదిక వాస్తవ విరుద్ధంగా ఉందని కేంద్రం విరుచుకుపడింది. గణాంకాలకు, వాస్తవాలకూ పొంతన కనిపించడం లేదని, సాంకేతిక అంశాలను ఎన్నింటినో వరల్డ్ బ్యాంక్ మరచిపోయిందని కేంద్ర అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇండియాలో 12.4 శాతమే పేదలు ఉన్నారని వరల్డ్ బ్యాంక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంకా మరెందరో ఇండియాలో దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారని వ్యాఖ్యానించిన ఆ అధికారి, సుమారు 21.2 శాతం మంది భారతీయులు పేదలని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) చేసిన సర్వేను గుర్తు చేశారు. వరల్డ్ బ్యాంక్ చెప్పినంత తక్కువ స్థాయి పేదరికం ఇండియాలో లేదని ఆయన వివరించారు. తప్పు లెక్కలతో ప్రపంచం దృష్టిలో భారత పరిస్థితిని మార్చి చూపారని ఆయన ఆరోపించారు.