: మా దగ్గరున్న నేతాజీ ఫైళ్లూ బయటపెడతాం: తొలిసారిగా చెప్పిన రష్యా


తమ దేశంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన దస్త్రాలను బయట పెట్టే ఆలోచనలో ఉన్నట్టు రష్యా తొలిసారిగా ప్రకటించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గి వావ్ రోవ్ నుంచి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు సమాచారం అందింది. రష్యా పర్యటనకు వెళ్లిన సమయంలో తాను ఈ విషయాన్ని అక్కడి అధికారులతో చర్చించగా సంతృప్తికర సమాధానం వచ్చిందని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. "నేతాజీకి సంబంధించిన ఏమైనా ఫైళ్లు ఉంటే అందించాలని కోరాము. తమ వద్ద ఆయన ఫైళ్లు ఏమైనా ఉన్నాయేమో పరిశీలిస్తామని ఆయన తెలిపారు. వాటి విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు" అని వికాస్ తెలిపారు.

  • Loading...

More Telugu News