: అవినీతి పోలీసులను పట్టిస్తే రూ. 25 వేల నజరానా!
ఇండియాలో అత్యంత అవినీతిపరులైన పోలీసులు ఢిల్లీలోనే ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో నష్ట నివారణకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఢిల్లీ పరిధిలో ఏ పోలీసైనా అవినీతికి పాల్పడితే, దాన్ని వీడియో లేదా ఆడియో ఆధారాలతో నిరూపించిన వారికి రూ. 25 వేల బహుమతి అందిస్తామని ప్రజలకు పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఆఫర్ ఇచ్చారు. పోలీసులకు లంచం ఇస్తున్న పౌరుల ప్రమేయాన్ని పట్టిస్తే రూ. 10 వేలు బహుమతి ఇస్తామని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ పోలీసుల అవితీతిపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.