: ‘అమెజాన్’లో లక్ష తాత్కాలిక నియామకాలు
అమెజాన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులకు వాటిని చేరవేసేందుకు లక్షమందిని తాత్కాలికంగా నియమించనుంది. పండగ సీజన్ సందర్భంగా అమెరికాలో ఈ నియామకాలను చేపట్టనున్నట్లు అమెజాన్ సంస్థ స్వయంగా ప్రకటించింది. గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా 80 వేల మందిని అమెజాన్ తాత్కాలికంగా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెజాన్ సంస్థలో 90 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 50 కస్టమర్ సర్వీస్, 20 ప్యాకేజ్ పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి 25 వేల మందిని నియమించినట్లుగా అమెజాన్ సంస్థ పేర్కొంది.