: ‘రాజధాని’ వంటలను రుచిచూసిన మంత్రులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన వంటల ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. ఈ ఏర్పాట్లు జరుగుతున్న చోటుకు మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, కిమిడి మృణాళిని వెళ్లారు. నాణ్యత విషయంలో లోపాలు ఉండకూడదని వంట నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. వంటకు సహకరిస్తున్న మహిళలు, పనివాళ్లతో కలిసి మంత్రులు భోజనం చేశారు. కాగా, మూడు విభాగాలుగా వంటలను విభజించారు. 400 మందికి పైగా వంటవారిని, 200 మంది ప్యాకింగ్ బోయ్స్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 1.60 లక్షల మందికి వంటలు వండిస్తున్నారు. 1.30 లక్షల ఫుడ్ ప్యాకెట్లను తయారు చేయిస్తున్న విషయం తెలిసిందే.