: బతుకమ్మ శోభాయాత్ర ప్రారంభం


హైదరాబాద్ నగరంలో సద్దుల బతుకమ్మ శోభాయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ట్యాంక్ బండ్ వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ పండగ జరుగుతోంది. తంగేడు, తామర, చామంతి, బంతి, గోరింట, బీర, గుమ్మడి, కలువపూలతో బతుకమ్మలను సుందరంగా తీర్చిదిద్దారు. ఎంగిలిపూవు బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News