: రెచ్చగొట్టే విధంగా క్యాబరేలు ఆడించడం సమర్థనీయం కాదు!: బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్


మహారాష్ట్రలో క్యాబరే డ్యాన్స్ లపై అక్కడి సర్కార్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, దీనిని సవాల్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మహారాష్ట్ర సర్కార్ ఆదేశాలపై స్టే విధించింది. 67 వేల మంది క్యాబరే డ్యాన్సర్లు తమ ఉపాధి కోల్పోతారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ‘సుప్రీం’ నిర్ణయంపై బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్, నటీమణులు పూజాభట్, కొంకణాసేన్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. మోతాదు మించని అశ్లీలం మంచిదే, కానీ ఆ ప్రయోజనాన్ని బార్ యజమానులు తేలిగ్గా తీసుకుని రెచ్చగొట్టే విధంగా క్యాబరేలు ఆడించడం సమర్థనీయం కాదని మాధుర్ భండార్కర్ అన్నారు. కాగా, ఈ చట్ట సవరణకు మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది సభ్యులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. దీంతో 2014 మహారాష్ట్ర పోలీసు చట్టంలో మార్పులకు ప్రభుత్వం చట్టసవరణ చేసింది. మహారాష్ట్రలో క్యాబరే డ్యాన్సుల నిషేధంపై ‘సుప్రీం’లో తమ వాదనను ‘మహా’ సర్కార్ గట్టిగా వినిపించనుంది.

  • Loading...

More Telugu News