: ఏలూరులో అదృశ్యమైన ఇంజినీరింగ్ విద్యార్థిని
బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ప్రీతి అనే విద్యార్థిని అదృశ్యం అయింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని రామచంద్రా ఇంజినీరింగ్ కాలేజీలో ప్రీతి చదువుతోంది. నిన్న కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో, కంగారు పడ్డ ఆమె తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి ఎంక్వైరీ చేశారు. సాయంత్రం 5 గంటలకే ప్రీతి వెళ్లిపోయిందని కాలేజీకి సంబంధించిన వ్యక్తులు తెలిపారు. అనంతరం వారు తెలిసిన వారందరినీ విచారించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రీతిది తూర్పుగోదావరి జిల్లా పెద్దపాడు మండలం తాళ్లమూడి గ్రామం.