: రేణుకాచౌదరిపై వీహెచ్, పొంగులేటి ఫిర్యాదు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకాచౌదరిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు ఆ పార్టీ నేతలు వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎడవెల్లి కృష్ణయ్య పోటీచేస్తారని ఓ బహిరంగసభలో రేణుక ప్రకటించారు. ఈ వ్యవహారంపై, వీహెచ్, పొంగులేటిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్ఠానం అనుమతితో సంబంధం లేకుండా, సొంత నిర్ణయం తీసుకున్న రేణుకపై చర్యలు తీసుకోవాలని డిగ్గీరాజాను వారు కోరారు.

  • Loading...

More Telugu News