: ప్రత్యేక హోదా ప్రకటిస్తే మోదీకి గుడికడతాం: కారెం శివాజీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే ప్రధాని నరేంద్ర మోదీకి గుడి కడతామని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య నాయకుడు కారెం శివాజీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రత్యేక హోదా సాధన సమాఖ్య ప్రతినిధులు మోదీ మాస్కులు ధరించి వినూత్న ప్రదర్శన నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన రోజున ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అధికార పార్టీ టీడీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ, ఇతర రాజకీయ పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమాఖ్యలు కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నాయి. ‘ఆంధ్రా’కు ప్రత్యేక హోదాకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల నిరవధిక నిరాహారదీక్ష చేపట్టడం, ఆ దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News