: జానారెడ్డిలో పోరాడేతత్వం లేదు: టీకాంగ్రెస్ ఎంపీ


తెలంగాణలో కేసీఆర్ దుష్టపాలన సాగుతోందని... ఆయన కుటుంబంలోని నలుగురు వ్యక్తులదే అధికారం అన్నట్టుగా పాలన ఉందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అయితే కేసీఆర్ పాలనను ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని ఆయన అన్నారు. అసెంబ్లీలో కూడా అధికారపక్షాన్ని కాంగ్రెస్ ఎదుర్కోలేకపోతోందని చెప్పారు. సీఎల్పీ నేత జానారెడ్డిలో పోరాడేతత్వం లేకపోవడమే దీనికి కారణమని పాల్వాయి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని కేసీఆర్ కు హితవు పలికారు. లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమవుతుందని, ప్రజాప్రతినిధులను ప్రజలు రాళ్లతో కొడతారని అన్నారు.

  • Loading...

More Telugu News