: బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ కంటికి గాయం
రాక్ ఆన్-2 సినిమా షూటింగ్ లో ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ కంటికి గాయమైంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం మేఘాలయకు వెళ్లిన ఆమెకు ఉన్నట్టుండి కంటినొప్పి వచ్చింది. రోజురోజుకీ నొప్పి ఎక్కువవడంతో స్థానిక కంటి డాక్టర్ వద్దకు ఆమె వెళ్లింది. కార్నియాపై గీతలు పడినట్లు శ్రద్ధా కపూర్ కంటిని పరీక్షించిన వైద్యుడు చెప్పాడు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ముంబయికి పంపాడు ఆ చిత్ర దర్శకుడు రితేశ్ సిధ్వానీ. రాక్ ఆన్-2 చిత్రం షూటింగ్ సుమారు రెండు నెలల పాటు షిల్లాంగ్ లో జరుగుతుందని ఆ చిత్ర యూనిట్ చెప్పింది.