: కళ్లు చిదంబరం అంత్యక్రియలు పూర్తి


ప్రముఖ సినీ హాస్య నటుడు కళ్లు చిదంబరం అంత్యక్రియలు ముగిశాయి. విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశాన వాటికలో కళాకారులు, అభిమానులు, బంధువుల మధ్య చిదంబరం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిదంబరంను కడసారి చూసిన వీరు కంటతడి పెట్టారు. అంతకు ముందు విశాఖలోని అక్కయ్యపాలెంలోని ఆయన స్వగృహం నుంచి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది. కళ్లు చిదంబరం గత కొంత కాలంగా శ్వాశకోశ వ్యాధితో బాధపడ్డారు. నిన్న ఉదయం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News