: గుంటూరులో సీఐడీ కార్యాలయానికి శంకుస్థాపన


నవ్యాంధ్రప్రదేశ్ లో మరో కీలక శాఖ కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. సీఐడీ నూతన కార్యాలయానికి ఏపీ డీజీపీ రాముడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. మొత్తం 2500 గజాల్లో రూ. 3.50 కోట్ల వ్యయంతో ఈ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్ వెనుక ఉన్న పోలీస్ క్వార్టర్స్ స్థలంలో సీఐడీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ, నిర్మాణం పూర్తయిన వెంటనే సీఐడీ కార్యకలాపాలు ఇక్కడ నుంచే కొనసాగుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News