: రైల్లో సీటు వద్దకే కోరిన భోజనం, 'ఈ-కేటరింగ్' మొదలు... బుకింగ్ ఎలాగంటే..!


భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ-కాటరింగ్ సేవలు ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 45 నగరాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా రైల్లో ప్రయాణం చేస్తున్న వారు ముందుగానే తమకు కావాల్సిన భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దాన్ని సదరు స్టేషన్లో సీటు వద్దకే తెచ్చి అందిస్తారు. డబ్బులు ఆన్ లైన్ ద్వారా, లేదా ఆహారాన్ని డెలివరీ తీసుకున్న తరువాత చెల్లించవచ్చు. భోజనాలను 'www.ecatering.irctc.co.in' ద్వారా బుక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో పాటు 0120-2383892, 0120-2383899 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-1034-139కు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చని, 139 నంబరుకు మెసేజ్ పంపి కూడా భోజనం పొందవచ్చని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఐఆర్సీటీసీ భోజనాలను సరఫరా చేసేందుకు హోటళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

  • Loading...

More Telugu News