: అమ్మ ఇస్తున్న 'కందిపప్పు' కానుక!
తమిళనాడు వాసులకు ముఖ్యమంత్రి జయలలిత దసరా కానుకను ప్రకటించారు. సహకార సంఘాల ద్వారా కిలో కందిపప్పును రూ. 110కే అందిస్తామని ప్రకటించి కొండెక్కిన ధరల నుంచి ఊరట కల్పించారు. వచ్చే నెల 1 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మూడు నెలల క్రితం వరకూ రూ. 80 నుంచి రూ. 100 వరకూ ఉన్న కందిపప్పు ధరలు రూ. 200కు చేరే వరకు తమిళనాడు హోటళ్లలో ఇడ్లీల నుంచి అన్ని రకాల అల్పాహార, భోజన ధరలను పెంచేశారు. రాష్ట్రంలో కందిపప్పు అవసరాలను కేంద్రానికి తెలిపి, 500 టన్నులను కోరగా, కేంద్రం మంజూరు చేసిందని ఈ సందర్భంగా జయలలిత వెల్లడించారు. అరకిలో కందిపప్పు ప్యాకెట్ ను రూ. 55కు, కిలో ప్యాకెట్ ను రూ. 110కి అందించనున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 91 సహకార స్టోర్లలో వీటిని ప్రజలు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.