: ప్రధాని ‘అమరావతి’ టూర్ ఎలాగంటే...!


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ప్రధానమంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) నుంచి ఏపీ అధికారులకు సమాచారం చేరింది. విజయదశమి రోజున (ఈ నెల 22న) మధ్యాహ్నం 12.30 గంటలకు శంకుస్థాపన ప్రాంతానికి చేరుకునే మోదీ, 1.46 గంటల దాకా అక్కడే ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచే తిరుమల వెళ్లనున్న ఆయన సాయంత్రం 6.15 గంటలకు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు. పీఎంఓ విడుదల చేసిన షెడ్యూల్ కింది విధంగా ఉంది. మధ్యాహ్నం 12.30 : ప్రధాని శంకుస్థాపన ప్రాంతానికి చేరిక 12.30-35: అమరావతి గ్యాలరీ సందర్శన 12.35-43 : శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొంటారు 12.43-45 : ప్రధాన వేదిక మీదకు రాక 12.48-50 : ‘మా తెలుగుతల్లి’ గీతం ఆలాపన 12.50-53 : జపాన్‌ మంత్రి యోసుకే తకాగి ప్రసంగం 12.53-56 : సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రసంగం 12.56-1.01: వెంకయ్య నాయుడు ప్రసంగం 1.01-11 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం 1.11-43 : ప్రధాని మోదీ ప్రసంగం 1.43-46 : ప్రధానికి, అతిథులకు జ్ఞాపికల అందజేత అనంతరం ప్రధాని తిరుపతి వెళ్తారు 3.30 - ప్రధాని తిరుపతి ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 3.34-42 : ఫోటో గ్యాలరీ సందర్శన 3.43-45 : కొత్త టెర్మినల్‌ కు ప్రారంభోత్సవం 3.50: ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌ లో మొబైల్ కంపెనీల శంకుస్థాపనకు పయనం 4.00 :మొబైల్‌ కంపెనీలకు శంకుస్థాపన 4.15 : అక్కడ నుంచి తిరుమలకు పయనం 5.00 : తిరుమలలోని పద్మావతి గెస్ట్‌ హౌస్‌కు చేరిక 5.00 నుంచి 5.10 వరకు విశ్రాంతి 5.15 : శ్రీవారి ఆలయానికి రాక 5.15 నుంచి 6.00 వరకు శ్రీవారి సేవలో 6.00: దేవాలయం నుంచి పద్మావతి గెస్ట్‌ హౌస్‌కు చేరిక 6.15: తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు.

  • Loading...

More Telugu News