: తెలంగాణ అధికారులకు రూట్ మ్యాప్ పంపండి: డీజీపీని ఆదేశించిన ఏపీ సీఎం


నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ రాముడుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రూట్ మ్యాప్ ను వెంటనే సిద్ధం చేసి, దానిని తెలంగాణ అధికారులకు అందజేయాలని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. హెలికాఫ్టర్, రోడ్డు మార్గానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని డీజీపీని బాబు ఆదేశించారు. కాగా, కేసీఆర్ ను శంకుస్థాపన మహోత్సవానికి ఆహ్వానించేందుకు గాను ఆయన నివాసానికి నిన్న చంద్రబాబు వెళ్లారు. సుమారు 50 నిమిషాల పాటు వారి సమావేశం జరిగింది. ‘శంకుస్థాపన మహోత్సవానికి తప్పకుండా వస్తాను’ అని చంద్రబాబుతో కేసీఆర్ చెప్పడం తెలిసిందే.

  • Loading...

More Telugu News