: ఎంచుకున్న రంగం ఏదైనా సరే... రాణించాలంటే ఇలా చేయండి!
గంటల తరబడి ఆఫీసులో కూర్చుని పనిచేయడం కన్నా ఫ్రీలాన్సర్ గా పనిచేయడం బాగుంటుందని భావిస్తున్న ఎక్కువ మంది అమ్మాయిలు ఆ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా టీచింగ్, డిజైనింగ్, సంగీత శిక్షణ వంటి మొదలైన రంగాల్లో నైపుణ్యం ఉన్న వాళ్లు ఫ్రీలాన్సర్ గా పనిచేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే, ఫ్రీలాన్సర్ గా ఎదగాలన్నా, ఆయా వృత్తులలో జీవితాన్ని మలచుకోవాలన్నా కొన్ని అంశాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆ అంశాలు.. * మొట్టమొదట ఒక అంచనాకు రావాలి. మనం ఎంచుకున్న రంగంలో మనకు ఉన్న అనుభవం, ప్రతిభా నైపుణ్యాలు, విశిష్టతలను అంచనా వేసుకోవాలి. అవసరమైతే వాటన్నింటిని ఒక పేపర్ పై పెట్టండి. ఒకవేళ ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోండి * ఫ్రీలాన్సర్ గా చేస్తున్న వారితో మాటామంతీ కలపండి. ఫ్రీలాన్సర్ గా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? వాటిని ఎలా అధిగమించారో తెలుసుకోండి. అలాగే వారి సలహాలు, సూచనలు కూడా తీసుకోండి. అవసరమైతే సామాజిక మాధ్యమాలైన లింక్డిన్, ఫేస్ బుక్ వంటివి ఉపకరిస్తాయి. దీంతో పాటు ప్రస్తుత మార్కెట్లో మన ప్రతిభా నైపుణ్యాలకు ఉన్న విలువ గురించి తెలుసుకోవడం, ఇంటిపనుల్ని, వృత్తి పనుల్ని చక్కగా విభజించుకోవడం చేస్తే ఫ్రీలాన్సర్ గా విజయం సాధిస్తాం.