: 20 లక్షలకు పైగా ఈ-ఇటుకలు విరాళం


‘మై బ్రిక్ - మై అమరావతి’కి అనూహ్య స్పందన లభిస్తోంది. ఐదో రోజుకు సుమారు 20 లక్షలకు పైగా ఈ-ఇటుకలను ఆన్ లైన్ లో విరాళమిచ్చారు. ఇప్పటివరకు ఆన్ లైన్ లో ఇటుకలు విరాళమిచ్చిన దాతల సంఖ్య 31,084. కాగా, నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనలో పాలు పంచుకోవాలనుకునేవారు ఈ వెబ్ సైట్ ద్వారా ఇటుకలను కొనుగోలు చేయవచ్చు. ‘మై బ్రిక్ - మై అమరావతి’ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ‘amaravati.gov.in’ వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదు రోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సైట్ ను ప్రారంభించిన కొద్ది క్షణాలకే సింగపూర్ లో ఉంటున్న ప్రవాసాంధ్రుడు ఒకరు 108 ఇటుకలను ఈ సైట్ ద్వారా కొనుగోలు చేశారు. ఒక్కో ఇటుక ధర రూ.10గా నిర్ణయించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News