: బాలనేరస్తుల వయస్సు 15కు తగ్గించాలి: సీఎం కేజ్రీవాల్
అత్యాచార ఘటనల్లో నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, నిందితుడిని జువెనైల్ గా పరిగణించే వయస్సును 15 ఏళ్లకు తగ్గించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో మహిళల భద్రత కోసం పలువురు మంత్రులను బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) గా నియమిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఆధ్వర్యంలో పనిచేసే ఈ బృందం మహిళల భద్రత అంశంపై కృషి చేస్తుందన్నారు. ఇటీవల ఢిల్లీలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి నిందితులుగా ఇద్దరు టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్, అత్యాచార సంఘటనల్లో నిందితుడిని జువెనైల్ గా పరిగణించే వయస్సును 15 ఏళ్లకు తగ్గించాలని కోరారు.