: 22న సీమ ప్రజలకు బ్లాక్ డే: బైరెడ్డి


కొన్ని దశాబ్దాలుగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని... ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ కొనసాగిస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన అనుయాయులు రాజధాని ప్రాంతంలో వేల ఎకరాల భూమిని కొన్నారని అన్నారు. అమరావతికి వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని... దీనిపై హైకోర్టులో పిల్ వేస్తామని హెచ్చరించారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఏపీ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి శంకుస్థాపనకు రాయలసీమ వాసులు ఎవరు వెళ్లినా... వారు సీమ ద్రోహులుగా మిగిలిపోతారని బైరెడ్డి అన్నారు. శంకుస్థాపన జరుగుతున్న 22వ తేదీ సీమవాసులకు బ్లాక్ డే అని చెప్పారు.

  • Loading...

More Telugu News