: ఎంఐఎంతో కాంగ్రెస్ కు సంబంధం లేదు: ఉత్తమ్ కుమార్
త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద ఈ రోజు జరిగిన రాజీవ్ సద్భావన రజతోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరం కలసి పనిచేయాలని చెప్పారు. నెహ్రూ, గాంధీ కుటుంబాల గౌరవాన్ని తగ్గించే దిశగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు.