: రావణాసురుడికి 10 తలలే, వీరికి మాత్రం 100 తలలు: జైపాల్ రెడ్డి


రాక్షసరాజు రావణుడికి కేవలం 10 తలలు మాత్రమే ఉన్నాయని, సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ నేతలకు మాత్రం 100 తలలు ఉన్నాయని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి విమర్శించారు. ఈ మధ్యాహ్నం మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రెండు సంస్థలూ రావణాసురుడిని మించిన రాక్షస శక్తులని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ఒకవైపు మత విద్వేషాలను దగ్గరుండి ప్రేరేపిస్తూ, మరోవైపు బీజేపీ నేతలను వారిస్తున్నట్టు, వారిపై కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. పరివార్ ఆగడాలను అడ్డుకునేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు.

  • Loading...

More Telugu News