: ఇంద్రాణి కుమారుడి ఇంట్లో సీబీఐ సోదాలు... దర్యాప్తు వేగవంతం
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన షీనా బోరా హత్యకేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. తాజాగా, షీనా బోరా సోదరుడు మిఖాయిల్ బోరా ఇంట్లో సోదాలు నిర్వహించింది. మొత్తమ్మీద ముంబై, కోల్ కతా, గౌహతిలతో పాటు తొమ్మిది చోట్ల సోదాలు జరిపింది. ఈ సందర్భంగా మిఖాయిల్ బోరా మాట్లాడుతూ, కేసులో భాగంగానే తన నివాసంలో సీబీఐ సోదాలు చేసిందని... దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపాడు. మరోవైపు, కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా సీబీఐ విచారణ సందర్భంలో... షీనాను తాను హత్య చేయలేదని, తన మొదటి భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ లు హత్య చేశారని తెలిపింది. దీంతో, సీబీఐ కేసు విచారణను ముమ్మరం చేసింది.