: తెలంగాణ సచివాలయంలో దొంగలు పడ్డారు!


అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో దొంగలు పడ్డారు. సెక్రటేరియేట్ లో ముఖ్యమంత్రి చాంబర్ పక్కనే ఉండే డీ బ్లాక్ లో గుర్తు తెలియని వ్యక్తులు జనరేటర్ బ్యాటరీని ఎత్తుకు వెళ్లారని గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నిన్న జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బయటి వ్యక్తులు వచ్చి దొంగతనం చేసే సాహసం చేయలేరని భావిస్తున్న పోలీసులు ఇది ఇంటి దొంగల పనే అయివుంటుందని భావిస్తూ, ఆ దిశగా విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పూర్తి నిఘా, అత్యధిక భద్రత ఉన్న ప్రాంతంలోనే దొంగతనం జరగడం ఉన్నతాధికారులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News