: ఎన్నికల్లో టికెట్ల కోసం మహిళల అశ్లీలత... పెను దుమారం రేపుతున్న కేరళ నేత ఫేస్ బుక్ పోస్టింగ్


కేరళలో మహిళా కాంగ్రెస్ నేతలు కొందరు ఎన్నికల్లో టికెట్లను సంపాదించుకునేందుకు పెద్దల వద్ద బట్టలు విప్పారని కాంగ్రెస్ మాజీ నేత ఏకే ఆంటోనీ ప్రధాన అనుచరుల్లో ఒకరు, ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు సీపీఐ తీర్థం పుచ్చుకున్న చెరియన్ ఫిలిప్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, "స్థానిక ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోలేకపోయిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. గతంలో నేతల వద్ద ఇదే పని చేసిన కొందరు మహిళా కార్యకర్తలు టికెట్లను పొందారు" అని అన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నేతలు, మహిళా సంఘాలు ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. దీంతో దిగివచ్చిన ఆయన "నేను మహిళలకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. నేను ఎప్పుడూ వారిని గౌరవిస్తాను. మహిళలను అవమానిస్తున్న కొందరు నేతల తీరును మాత్రమే వేలెత్తి చూపాను" అని వివరణ ఇచ్చారు. తక్షణం ఆయన తన వ్యాఖ్యలను విరమించుకోవాలని, మహిళలకు క్షమాపణ చెప్పాలని కేరళ పీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్ డిమాండ్ చేశారు. ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నట్టు మహిళా కాంగ్రెస్ నేతలు బిందుక్రిష్ణ, షనిమోల్ ఉస్మాన్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News