: ప్రధాన హీరోలు ఆరేళ్ల కాల్షీట్లు ఇస్తేనే మహాభారతం... ఎవరిస్తారు?: రాజమౌళి


తన కలల ప్రాజెక్టు 'మహాభారతం' చిత్రం గురించి దర్శక దిగ్గజం రాజమౌళి మద్రాసు ఐఐటీ విద్యార్థులతో మనసు విప్పి మాట్లాడాడు. ఈ కథను చిత్రంగా మలిస్తే, కనీసం పదేళ్లు పడుతుందని, నాలుగు భాగాలుగా సినిమా తీయాల్సి వుంటుందని స్పష్టం చేశాడు. ఈ చిత్రంలో నటించాలని భావించే నటీనటులు కనీసం ఆరేళ్ల పాటు తనకు కాల్షీట్లు ఇచ్చి, ఇతర చిత్రాలేవీ ముట్టుకోకూడదని అన్నాడు. అంత సుదీర్ఘంగా తమ కాల్షీట్లు ఇచ్చే నటులు ఎవరున్నారని ఐఐటీయన్లను రాజమౌళి ప్రశ్నించాడు. ఇది అసంభవమని... అయితే, సాధ్యమని భావించిన నాడు తన మహాభారతానికి తొలి క్లాప్ పడుతుందని తెలిపాడు. ఐఐటీ విద్యార్థులు బాహుబలి చిత్రం షూటింగ్, పాటించిన టెక్నిక్స్ గురించి అడుగగా, రాజమౌళి ఓపికతో సమాధానాలు ఇచ్చాడు.

  • Loading...

More Telugu News