: శరత్ కుమార్ పై విశాల్ టీమ్ స్పష్టమైన ఆధిక్యం... ఎవరికెన్ని ఓట్లంటే!


దక్షిణాదిన అతిపెద్ద సినీ సంఘంగా ఉన్న నడిగర్ సంఘం ఎన్నికల్లో యువ హీరో విశాల్ టీమ్ హవా కొనసాగి, సీనియర్ నటుడు శరత్ కుమార్ ఆధ్వర్యంలోని టీమ్ చిత్తయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో దాదాపు 3,000 మంది నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అధ్యక్ష పదవికి నాజర్, శరత్ కుమార్ పోటీ పడ్డారు. నాజర్ కు 1344 ఓట్లు, శరత్ కుమార్ కు 1231 ఓట్లు వచ్చాయి. దీంతో నాజర్ 113 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి పద్మనాభన్ ప్రకటించారు. ఇక ప్రధాన కార్యదర్శిగా పోటీపడ్డ విశాల్ కు 1445 ఓట్లు రాగా, అతనికి పోటీగా బరిలో ఉన్న రాధా రవికి 1138 ఓట్లు వచ్చాయి. కోశాధికారిగా యువ హీరో కార్తి గెలిచాడు. గత పదేళ్లుగా నడిగర్ సంఘాన్ని ఏలిన శరత్ కుమార్, విజయం సాధించిన విశాల్ బృందానికి అభినందనలు తెలిపింది. ఆయనకు పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News