: రామోజీ ఫిల్మ్ సిటీకి చంద్రబాబు... రామోజీకి ఆహ్వనం అందించనున్న ఏపీ సీఎం
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు హైదరాబాదు నగర శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లనున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆయన 'ఈనాడు' గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును ఆహ్వానించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తదితర ప్రముఖులను శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు చంద్రబాబు నిన్న హైదరాబాదు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రే ఆయన కేసీఆర్, నరసింహన్ లను ఆహ్వానించారు. నేటి ఉదయం చంద్రబాబు నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావుకు ఆహ్వాన పత్రిక అందజేస్తారు.