: బోల్తా పడ్డ టీమిండియా... చేజేతులా పరాజయం పాలైన వైనం


ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా నిన్న రాజ్ కోట్ లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా బోల్తా కొట్టింది. సునాయసంగా విజయం సాధించే అవకాశాలున్న ఈ మ్యాచ్ లో చివరి దాకా ఆశలు సజీవంగా కాపాడుకుంటూ వచ్చిన ధోని సేన చివరిలో చేతులెత్తేసింది. 45 ఓవర్ల దాకా విజయం భారత్ చేతిలోనే ఉన్నా, ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 270 పరుగులు చేశారు. ఈజీ లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా తొలుత జూలు విదిల్చింది. ఓపెనర్ రోహిత్ శర్మ(67) మరోమారు జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. ఇక శిఖర్ ధావన్ మరోమారు విఫలం కాగా, అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (77) చెలరేగిపోయాడు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (47) కూడా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. సురేశ్ రైనా (0), అజింక్యా రెహానే (4) విఫలం కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా సఫారీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత బరిలోకి దిగిన అక్షర్ పటేట్ (15), హర్భజన్ సింగ్ (20)లు కష్టపడ్డా ఫలితం లేకపోయింది. 252 పరుగల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ను ముగించింది. దీంతో సఫారీలు 18 పరుగుల తేడాతో విజయం సాధించారు. సిరీస్ లో 2-1 ఆధిక్యంతో ముందుకెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News