: బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బాబు తన నివాసానికి వెళతారు. టీ టీడీపీ నేతలతో అక్కడ సమావేశం జరగనుంది. అనంతరం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ లను కలిసి వారికి అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాలను బాబు అందజేస్తారు. కాగా, అతిథిగా వస్తున్న చంద్రబాబును కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తారా? లేదా? అనే విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.