: ఎల్బీనగర్ లో నలుగురు చిన్నారుల అదృశ్యం
హైదరాబాద్, ఎల్బీనగర్ లో ని ఎస్బీహెచ్ కాలనీలో నలుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఇంటిబయట ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగినట్లు చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కార్తీక్ రెడ్డి (8), తరుణ్ కుమార్ రెడ్డి (7), హర్షవర్థన్ రెడ్డి (6), జశ్వంత్ (3) అనే చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా, గతంలో కూడా ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారులు అదృశ్యమైన సంఘటనలు నగరంలో జరిగాయి.