: మోదీకి స్వాగతం, ప్రత్యేక హోదాపై ప్రకటించకుంటే మాత్రం..: కారెం శివాజీ
అమరావతి శంకుస్థాపనకు వచ్చే భారత ప్రధాని నరేంద్ర మోదీకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతామని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య నేత కారెం శివాజీ తెలిపారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈలోగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కనీసం 22న శంకుస్థాపన వేదిక నుంచి హోదా ఇస్తున్నట్టు తెలియజేయాలని, లేకుంటే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రత్యేక హోదాను ఆంధ్రుల హక్కుగా అభివర్ణించిన శివాజీ, మరిన్ని నిరసనలు జరిగి రాష్ట్రంలో ఆశాంతి పెరగక ముందే మోదీ కల్పించుకోవాలని సూచించారు.