: శరత్ కుమార్, విశాల్ ల మధ్య మొదలైన పోరు!


పోలీసుల భారీ భద్రత మధ్య దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. 'నడిగర సంఘం'గా పాప్యులర్ అయిన ఈ సినీ నటుల సంఘం ఎన్నికల్లో, ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ టీమ్, యువ హీరో విశాల్ టీమ్ లు పోటీ పడుతున్నాయి. శరత్ కుమార్ ప్యానల్ తరఫున మరో యువ హీరో శింబు పోటీలో ఉండటంతో ఎన్నిక హోరాహోరీగా సాగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. చాలా కాలంగా ఈ సంఘంలో శరత్ కుమార్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా, ఇటీవల ఆయన తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎంజీఆర్ నిర్మించిన నడిగర సంఘం భవనాన్ని కూలగొట్టి ఓ షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని శరత్ కుమార్ నిర్ణయించడంతో వివాదం మొదలైంది. దీన్ని బాహాటంగా విమర్శించిన విశాల్, తాను పోటీలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. పలువురు సీనియర్ నటులు విశాల్ కు మద్దతు తెలపడంతో, విజయం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన సుమారు 3,500 మంది ఈ ఎన్నికల్లో ఓట్లు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News