: హైదరాబాద్ టు విశాఖపట్నం... ఆర్టీసీ బస్సు చార్జీ రూ. 1,500


దసరా పండగకు దూరప్రాంతాలకు వెళ్లే వారి నుంచి ఓ వైపు ప్రైవేటు బస్సు టూర్ ఆపరేటర్లు దోచుకుంటుంటే, తామేమీ తక్కువ తినలేదన్నట్టు ఆర్టీసీ 'ప్రత్యేకం' పేరిట జేబులకు చిల్లు పెడుతోంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలని భావించే వారి నుంచి ఏకంగా రూ. 1,486 టికెట్ ధర పెట్టింది. ఈ టికెట్ ను ఆన్ లైన్లో బుక్ చేసుకోవాలని భావిస్తే మరో రూ. 30 వరకూ అదనంగా పెట్టక తప్పదు. సాధారణ పరిస్థితుల్లో విశాఖకు సూపర్ లగ్జరీలో రూ. 692, గరుడ ఏసీలో రూ. 1,055 చార్జీలను వసూలు చేస్తుండగా, స్పెషల్ బస్సుల పేరిట సూపర్ లగ్జరీలో రూ. 1,007, గరుడాలో రూ. 1,486ను టికెట్ ధరగా నిర్ణయించారు. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడకు లగ్జరీ బస్సులో చార్జీ రూ. 283 కాగా, స్పెషల్ బస్సుల్లో రూ. 424 వసూలు చేస్తున్నారు. ఇదే రూట్లో గరుడ బస్సుల్లో రూ. 477 గా ఉన్న చార్జీని రూ. 666కు పెంచేశారు. తిరుపతి, చిత్తూరు, కడప, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శనివారం రాత్రి ప్రత్యేక బస్సులంటూ నగరంలో తిరిగే మెట్రో లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News