: ప్రపంచ ఛాంపియన్ ను చిత్తు చేసిన పీవీ సింధు
ఇండియన్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు సంచలనం నమోదు చేసింది. డెన్మార్క్ ఓపెన్ ఈ సంచలనానికి వేదిక అయింది. ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్, రెండో సీడ్ కరోలినా మారిన్ కు సింధు షాక్ ఇచ్చింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో 21-15, 18-21, 21-17 తేడాతో సింధు ఘన విజయం సాధించింది. గంట 14 నిమిషాల పాటు ఈ మ్యాచ్ కొనసాగింది. ఈ విజయంతో మారిన్ పై సింధు తన రికార్డును 2-3కు మెరుగుపరుచుకుంది. ఫైనల్స్ లో చైనా క్రీడాకారిణి, 2012 ఒలింపిక్ ఛాంపియన్ లీ యురేయితో సింధు తలపడుతుంది.