: 'అత్యాచారాల'పై కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల అత్యాచారాలను అరికట్టడంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర గురించి ఓ మహిళా జర్నలిస్టు ఈశ్వరప్పను అడిగింది. దీనికి సమాధానంగా... "మీరు ఓ మహిళ. మిమ్మల్ని ఎవరైనా లాక్కెళ్లి అత్యాచారం చేస్తే... ఎక్కడో ఉన్న మేమేం చేయగలుగుతాం?" అని ఈశ్వరప్ప అన్నారు. కర్ణాటకలో చోటుచేసుకుంటున్న ఘటనలకు అధికారంలో ఉన్న పార్టీనే బాధ్యత వహించాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.