: కందూరును తెలంగాణ శ్రీశైలంగా అభివృద్ధి చేస్తాం: కవిత


సొంత రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. బతుకమ్మ ఉత్సవాలు ఆరో రోజైన నేడు మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి కవిత కొత్తకోట చేరుకున్నారు. ఈ సందర్భంగా, కందూరి రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ఆమె పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కందూరును తెలంగాణ శ్రీశైలంగా, దక్షిణ కాశిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కందూరులో కాశీలో ఉన్నట్టు కదంబ కల్పవృక్షాలు ఉన్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News