: జగన్ మాకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు: మంత్రి అయ్యన్న
రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించాలనుకున్న ఏపీ మంత్రుల బృందానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అపాయింట్ మెంట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాజధాని శంకుస్థాపనకు అందరూ రావాలనే ఉద్దేశంతో ప్రముఖులను స్వయంగా మంత్రుల బృందం వెళ్లి ఆహ్వానిస్తోందని తెలిపారు. అదేవిధంగా స్వయంగా వెళ్లి జగన్ కు ఆహ్వాన పత్రిక ఇవ్వాలనుకున్నామని చెప్పారు. అయితే జగన్ ను కలిసేందుకు తమకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెప్పారు. రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఫోన్ లో మాట్లాడటానికి కూడా ఆయన అందుబాటులోకి రావడం లేదన్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం మన దురదృష్టమని, ప్రతిపక్ష నేత అంటే ఎలా ఉండాలో తెలంగాణ నేత జానారెడ్డిని చూసి జగన్ నేర్చుకోవాలని అయ్యన్న సూచించారు.