: రేపు సాయంత్రం కేసీఆర్ ను కలవనున్న చంద్రబాబు... అపాయింట్ మెంట్ కోరిన ఏపీ సీఎంఓ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రేపు సాయంత్రం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలవనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని కేసీఆర్ ను తానే స్వయంగా ఆహ్వానించనున్నట్లు ఇదివరకే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) అధికారులు అపాయింట్ మెంట్ కోసం తెలంగాణ సీఎం కార్యాలయాన్ని సంప్రదించారు. ఏపీ సీఎంఓ వినతికి తెలంగాణ సీఎంఓ అధికారులు స్పందించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News