: ఎర్రచందనం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్సైపై కారంతో దుండగుల దాడి


తిరుపతిలో ఎర్రచందనం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్సై అశోక్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. తెల్లవారుజామున పద్మావతిపురంలోని తన ఇంటి నుంచి ఎస్సై పాలకోసం బయటకు రాగా దుండగులు కారంపొడి చల్లారు. వెంటనే ఎస్సై తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చడంతో దుండగులు పరారయ్యారని తెలిసింది. స్వల్పంగా గాయపడిన ఎస్సైని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎర్రచందనం స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గతంలో జరిగిన 20 మంది ఎర్రచందనం దొంగల ఎదురుకాల్పుల ఘటనలో కూడా ఆయన పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News