: నారా లోకేశ్ కుమారుడికి అన్నప్రాసన... రేపు తిరుమలలో వేడుక


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ అన్నప్రాసన వేడుక వేదిక తిరుమలకు మారింది. ఏపీ సీఎం, దేవాన్ష్ తాత నారా చంద్రబాబునాయుడి సొంతూరు నారావారిపల్లెలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నా, అనివార్య కారణాలతో అది వాయిదా పడింది. తాజాగా ఈ వేడుకను వెంకన్న సన్నిధి తిరుమలలో నిర్వహించేందుకు చంద్రబాబు కుటుంబం నిర్ణయించింది. ఈ నెల 18న తిరుమలలో జరగనున్న ఈ వేడుకకు లోకేశ్, చంద్రబాబు దంపతులతో పాటు నందమూరి బాలకృష్ణ దంపతులు కూడా హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News