: ‘బ్రూస్ లీ’కి ఆ పేరు ఎందుకు పెట్టారు? : వర్మ సెటైర్లు
‘బ్రూస్ లీ లేని ఈ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారో బ్రూస్ లీ అభిమానిగా నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమాకు ఆ పేరు పెట్టకపోయి ఉంటే రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉండేది. బ్రూస్ లీ అనడంతోనే అసలు చిక్కంతా వచ్చింది. బ్రూస్ లీ చిత్రం చూసి వచ్చిన తర్వాత, అసలు బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్’ చిత్రం చూశాను. బాస్(చిరంజీవి) తన 150వ సినిమా కోసం బ్రూస్ లీ చిత్రాన్ని ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కావట్లేదు. బ్రూస్ లీని సినిమాలో చేర్చకపోయినట్టయితే రామ్ చరణ్ బ్రూస్ లీలాగే కనిపించి ఉండేవాడు. చిరంజీవి 151వ సినిమాలో బ్రూస్ లీ లో కన్నా గొప్పగా కనిపించాలి. చిరంజీవి 151వ చిత్రం మెగా కిక్కింగ్ పవర్ పంచ్ ఇస్తుంది. ఇంతకీ 151వ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది.. బాస్?’ అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.